కంచె చేను మేస్తే... బాధితుల ఆస్తులపై కన్నేశారంటూ కాంగ్రెస్ ఆరోపణలు

విశ్వంభర, ఘట్‌కేసర్: ఘట్‌కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కార్రె రాజేష్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో నారపల్లికి చెందిన కొందరు బాధితుల ఆస్తి వివాదంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2001 నుంచి నారపల్లి మెయిన్ రోడ్డులో ఉన్న నాలుగు షాపులను కుటుంబ సభ్యులు అద్దెకు ఇచ్చి జీవనోపాధి పొందుతున్నారని, వాటికి సంబంధించిన ఆస్తి పన్నులు, విద్యుత్ బిల్లులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారని తెలిపారు. అయితే మల్లుల్ల అభిషేక్ అనే న్యాయవాది, వీలునామా ఆధారంగా ఆ షాపులు ఉన్న స్థలాన్ని ఖాళీ భూమిగా చూపించి నకిలీ పత్రాలతో రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించి తన పేరుపై నమోదు చేసుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ విషయమై తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు పోచారం మున్సిపల్ అధికారులు స్థలాన్ని పరిశీలించగా, అక్కడ నాలుగు దుకాణాలు ఉన్నాయని, వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, అసలు యజమానులు పన్నులు చెల్లిస్తున్నారని నిర్ధారించి మున్సిపల్ రికార్డుల సవరణ, హౌస్ నంబర్ కేటాయింపు దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిపారు. అలాగే విద్యుత్ కనెక్షన్ కోసం చేసిన దరఖాస్తు కూడా విచారణలో లోపాలు గుర్తించి తిరస్కరించబడిందన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తున్నామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. సమావేశంలో పోచారం మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పీర్జాదిగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, పల్లె బాబురావు, మెట్టు గణేష్, ఎర్రరాజు, సల్మాన్, సామల అమర్, ఉదయ్‌కుమార్ రెడ్డి, నరేష్ గౌడ్, మాజీ సర్పంచ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-congress-accused-that-the-property-of-the-victims-was/article-17289

Tags: