శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు
విశ్వంభర, మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని విద్యానగర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మశ్రీ మలపాక నాగరాజు శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు గణపతి పూజ, స్వస్తిపుణ్యాహవాచనం, మాతృకాపూజ, యాగశాల ప్రవేశం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో దేవస్థాన గౌరవ అధ్యక్షులు, 17వ వార్డు కౌన్సిలర్ నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. జూన్ 29 వరకు ఐదు రోజుల పాటు చండీహోమం, సుదర్శన హోమం, హరికథ, ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించనున్నారు. జూన్ 29న ఉదయం శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టతో పాటు ధ్వజస్తంభం, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, నవగ్రహాల స్థిర ప్రతిష్టాపన కార్యక్రమాలు జరగనున్నాయి. అనంతరం మహా అన్నప్రసాద వితరణ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.