సంపత్ మృతిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయొద్దు: కాంగ్రెస్
విశ్వంభర, హుస్నాబాద్ : మహమ్మదాపూర్ మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ మృతిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తగదని హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెన్న రాజు అన్నారు. గురువారం పోతారం(ఎస్) గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంపత్ మృతి దురదృష్టకరమని, ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పారు. అయితే ఈ ఘటనను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి పొన్నం ప్రభాకర్‌పై నిరాధార ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి పొన్నం ప్రభాకర్ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బంక చందు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచులకు రావాల్సిన బిల్లులు చెల్లించకపోవడం వల్ల అనేక మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ బిల్లుల సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతోందని తెలిపారు. సంపత్ మృతి విషయం తెలిసిన వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో మాట్లాడి పెండింగ్ బిల్లుల అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారని చెప్పారు. కొంతమంది నాయకులు శవయాత్రను రాజకీయ వేదికగా మార్చి మంత్రి ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన కాంగ్రెస్ నేతలు, ఇలాంటి నిరాధార విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పోతుగంటి బాలయ్య, రిక్కల రాజిరెడ్డి, వేల్పుల సంపత్, భూక్య రమేష్ నాయక్, సంఘ శ్రీధర్, గాలిపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.