కార్మికుల ఐక్యతతోనే హక్కుల పరిరక్షణ : మధుసూదనాచారి

విశ్వంభర, బాగ్ లింగంపల్లి:  కార్మికుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల అమలు, గృహ వసతి, విద్య, వైద్య సౌకర్యాల సాధన కోసం సంఘటిత పోరాటమే మార్గమని శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఎదుర్కొంటూ అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు తెలంగాణ కార్మిక సమాఖ్య (టీకేఎస్) చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణ కార్మిక సమాఖ్య (టీకేఎస్) 6వ రాష్ట్ర మహాసభలు గురువారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వశపాక నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలకోట రామన్న, టీకేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొజ్జ భిక్షమయ్య, టీపీసీసీ అధికార ప్రతినిధి ఆరెపల్లి రాజేందర్, ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు, కొలా జనార్ధన్ గౌడ్, పల్లెల వీరాస్వామి, డాక్టర్ అప్పికట్ల భరత్ భూషణ్ పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ కార్మిక రంగంలో అమలవుతున్న కార్మిక వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ, వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల హక్కుల సాధనకు టీకేఎస్ నిరంతరం పోరాడుతోందన్నారు. విధి నిర్వహణలో మరణించిన లేదా వికలాంగులైన కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగేలా యాజమాన్యాలు, ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన కార్మిక కుటుంబాలకు గృహ వసతి, వైద్యం, విద్య వంటి మౌలిక సౌకర్యాలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పిస్తూ ఇతర కార్మిక సంఘాలతో కలిసి ఉద్యమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం, సామాజిక న్యాయం, కార్మిక సంక్షేమమే టీకేఎస్ లక్ష్యమని స్పష్టం చేశారు. మహాసభలో కార్మికులకు ఇంటి స్థలాలు, గృహనిర్మాణ సహాయం, ఉచిత బీమా, కార్మికుల పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రాధాన్యత, ఆరోగ్యశ్రీ విస్తరణ, అసైన్డ్ భూములకు చట్టబద్ధత, భూములు కోల్పోయిన కుటుంబాలకు నష్టపరిహారం, ఉద్యోగ అవకాశాల కల్పన తదితర డిమాండ్లతో తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో: టీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యాతాకుల ఈశ్వర్ ప్రధాన కార్యదర్శి బందెల యాదగిరి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహ్మద్ రజాక్ మహిళా అధ్యక్షురాలు చిలుముల్ల సుజాత మహిళా ప్రధాన కార్యదర్శి కొండపల్లి లక్ష్మి ఏపీ మహిళా అధ్యక్షురాలు నెమలిపురి నాగమణి ఏపీ ప్రధాన కార్యదర్శి సాంటి రత్నకుమారి ఉపాధ్యక్షులు అల్వాల వెంకన్న బండా నర్సింహ అధికార ప్రతినిధి దువ్వలగట్టు శేఖర్ గ్రేటర్ హైదరాబాదు అధ్యక్షురాలు ముంతాజ్ బేగం ఫైమా బేగం మచ్చ చంద్రయ్య కొమ్ము లక్ష్మి సుజాత పాల్గొన్నారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/madhusudanachari-said-that-the-protection-of-rights-is-only-through/article-17248

Tags: