బీజేపీ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ హత్యా దివస్’ నిరసన

విశ్వంభర, కేసముద్రం: కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన "సంవిధాన్ హత్యా దివస్" (రాజ్యాంగ హత్య దినం) పురస్కరించుకొని, గురువారం ఉదయం కేసముద్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ  మండల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిరసన  కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ కేసముద్రం మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అధికార దాహంతో ఇందిరా గాంధీ ,తన కుమారుడు సంజయ్ గాంధీతో కలిసి జూన్ 25న ఎమర్జెన్సీ విధించాలని నిర్ణయించి జూన్ 26వ తేదీ తెల్లవారుజామున దేశంలో ఎమర్జెన్సీ విధించి పౌర హక్కులు సస్పెండ్ చేశారు, ప్రతిపక్ష నేతలను అరెస్టు చేశారు, పత్రికలపై సెన్సార్‌షిప్ విధించారు. ఈ ఎమర్జెన్సీ సుమారు 21 నెలల పాటు కొనసాగి, భారత రాజకీయాలపై చెరగని ముద్ర వేసింది.  1975లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూల్చివేసి, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఎమర్జెన్సీ విధించిందని మండిపడ్డారు. ఇందిరా గాంధీ నిరంకుశత్వానికి, అధికారదాహనికి భారత ప్రజాస్వామ్యం బలైపోయింది ప్రాథమిక హక్కులు హననమయ్యాయి వ్యవస్థ మొత్తం కునారిల్లింది.. ఈ నెత్తుటి అధ్యాయం.. చరిత్ర మరవదు..క్షమించదు అన్నారు.ఆనాటి చీకటి రోజులను స్మరిస్తూ ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు. నాటి అణచివేతకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడిన వీరుల త్యాగాలను గౌరవించడం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్ మాట్లాడుతూ.. పత్రికా స్వేచ్ఛను హరించిన చేదు నిజం – 1975 అత్యవసర పరిస్థితి! 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించడం అంటే రాజ్యాంగాన్ని హత్య చేయడమేనని, అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన రోజు అని ధ్వజమెత్తారు. ఎమర్జెన్సీ విధించి 51 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నాటి దారుణ ఘటనలను గుర్తుచేస్తూ, రాజ్యాంగ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. ఈ విషయాలను భావి తరాలకు తెలియజేయడం మన కర్తవ్యమన్నారు. రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా సాగిన ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ కన్వీనర్ బోగోజు నాగేశ్వరాచారి, జిల్లా నాయకుడు ఓలం శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షురాలు నాగరబోయిన చంద్రకళ, బచ్చు లక్ష్మీనారాయణ, కొండ్రెడ్డి వీరారెడ్డి, గుండు దామోదర్, మూడావత్ అశోక్, బాణోత్ సురేందర్, వెలిశాల నవీన్, ముదిరెడ్డి మురళి, గొట్టె వెంకన్న, పెరుమాండ్ల నవీన్, బేతి వెంకన్న, బానోత్ రాము, బొద్దుల సతీష్, జాటోత్ సురేష్, వాంకుడోత్ మాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/samvidhan-hathya-divas-protest-under-the-leadership-of-bjp/article-17284

Tags: