రోడ్లపై అక్రమ పార్కింగ్‌తో ట్రాఫిక్ సమస్యలు
- పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు
విశ్వంభర, కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా స్థానిక టీ సర్కిల్ నుంచి అనంతపురం రోడ్డువరకు వాహనదారుల నిర్లక్ష్యంతో పాటు ట్రాఫిక్ నియమాల అమలులో అధికారుల అలసత్వం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులపై కార్లు, ద్విచక్ర వాహనాలను ఇష్టానుసారంగా పార్క్ చేసి గంటల తరబడి వదిలివేయడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తాజాగా ఓ వ్యక్తి తన కారును నడిరోడ్డులోనే పార్క్ చేసి షాపింగ్‌కు వెళ్లడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో బస్సు రావడంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయి కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రయాణికులు, ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ ట్రాఫిక్ పోలీసులు మాత్రం స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ రోడ్లపై వాహనాలు నిలిపే వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారులపై అక్రమ పార్కింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధించాలని స్థానికులు కోరుతున్నారు. వాహనదారులు కూడా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ నిర్దేశిత పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలను నిలిపితే ఇలాంటి సమస్యలు తగ్గే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.