యువత స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి

యువత స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి

  •  డ్రగ్స్ కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి
  •  ఉన్నతమైన ఆలోచనలు గొప్పవాళ్లను చేస్తాయి
  •  సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ 

 విశ్వంభర, సూర్యాపేట: మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక  దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ నిర్మూలన అవగాహన సదస్సు లో  జిల్లా కలక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి ఎస్పీ నరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ, నేటి యువత, నేటి బలాలు దేశానికి రేపటి భవిష్యత్తు అన్నారు, ఇలాంటి భవితవ్యం ఉన్న యువత, విద్యార్థులు డ్రగ్స్ మహమ్మారి కి బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, మత్తులో నేరాలు చేస్తూ జైలుపాలౌతున్నారు అన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై పెట్టుకున్న ఆశలను, కలలను నాశనం చేస్తున్నారు అని తెలిపినారు. వ్యసనాలకు దూరంగా ఉండడానికి యువత స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి అని కోరారు. విలక్షణమైన కోరికలను, అలవాట్లను నియంత్రిస్తే సమాజంలో గొప్పవారు అవుతారు అని గుర్తు చేశకలం. విలాసవంతమైన, సుఖవంతమైన జీవితాన్ని త్యజించిన బుద్ధుడు నేటికి గొప్పవ్యక్తిగా కీర్తించబడుతున్నాడు, బుద్ధుడు చెప్పిన మంచి మాటలు వేల సంవత్సరాలు గడిచిన సమాజం మరిచిపోలేదు అన్నారు. అలాగే ఎందరో గొప్పవారు సమాజం కోసం త్యాగాలు చేశారు సమాజంలో మంచి స్థాపనకు, సమాజ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి జీవితాలను అంకితం చేశారు అలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు. డ్రగ్స్ కు నో చెప్పి సంతోషకరమైన జీవితాన్ని, అందమైన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మన జిల్లాను, మన సమాజాన్ని గంజాయి  రహితంగా మార్చడంలో ప్రతిఒక్కరు భాగస్వామ్యం కావాలి అన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడ్డ వాటిని, డ్రగ్స్ సరఫరా, రవాణా వినియోగం కు సంబంధించిన సమాచారాన్ని డయల్ 100, 112, ఈగల్ పోలీస్ ఫోర్స్ టోల్ ఫ్రీ 1908 కు సమాచారం ఇవ్వాలి అన్నారు. ప్రభుత్వాలు, అధికారులు డ్రగ్స్ నిర్మూలనలో అనుక్షణం పని చేస్తున్నారు అన్నారు. రోడ్డు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలి, వేగంగా వెళ్ళవద్దు, మద్యం మత్తులో వాహనాలు నకపవద్దు, తప్పుడు మార్గంలో వెళ్ళవద్దు, పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు, హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలి ఇలాంటి అంశాలపై పెద్దలను, వాహనదారులను బాధ్యతగా చైతన్యవంతం చేయాలి అని కోరారు. అజాగ్రత్త వల్ల సైబర్ మోసాల బారిన పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. అత్యాశకు పోవద్దు, ఉచిత బహుమతులు, కూపన్స్, తక్కువ రేటుకు  వస్తువులు, వాహనాలు ఉన్నాయి, ఇలాంటి మాయ మాటలు, మోసపూరిత ప్రకటనలు నమ్మవద్దు. వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా ఓటీపీ వివరాలు అపరిచితులకు చెప్పవద్దు అని కోరారు. మహిళల భద్రతకు పోలీసు ప్రాధాన్యత ఇస్తుంది, వేధింపులు, దాడులపై ధైర్యంగా పిర్యాదు చేయాలి అన్నారు. ఆకతాయిలు, ఆవారాగాళ్ళు, పోకిరీలు చెప్పే మాయ మాటలు నమ్మి వారి వలలో పడవద్దు, ప్రేమ ఆకర్షణలకు గురై జీవితాన్ని కోల్పోవద్దు అన్నారు. తల్లిదండ్రులు చూపేదే నిజమైన ప్రేమ అన్నారు.  డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వామ్యం అవుతాము, డ్రగ్స్ కు దూరంగా ఉంటాం అని ప్రతిజ్ఞ చేయించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా సంక్షేమ అధికారి నరసింహ రావు, సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, జిల్లా అధికారులు, పట్టణ ఎస్ఐ లు, షి టీమ్ సిబ్బంది, పోలీస్ కళాబృందం సభ్యులు ఉన్నారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/youth-should-have-self-control/article-17303

Tags: