ఇందిరా మహిళా శక్తి పథకంతో మహిళలకు ఆర్థిక భరోసా

విశ్వంభర, కీసర : రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు  దమ్మాయిగూడ నాలుగో వార్డ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దిలీప్ సాల్వే అన్నారు. గురువారం కీసర సర్కిల్ దమ్మాయిగూడ డివిజన్ పరిధిలోని బండ్లగూడలో ఇందిరా మహిళా శక్తి తిరునాళ్ల కార్యక్రమాన్ని నిర్వహించి మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, మహిళలు అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/%E0%B0%87%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%B3%E0%B0%BE-%E0%B0%B6%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%A5%E0%B0%95%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%B3%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BF%E0%B0%95-%E0%B0%AD%E0%B0%B0%E0%B1%8B%E0%B0%B8%E0%B0%BE/article-17297

Tags: