కమాన్‌పూర్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

విశ్వంభర, కమాన్‌పూర్ : కమాన్‌పూర్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికలు  నిర్వహించగా, అధ్యక్షుడిగా సానా రామకృష్ణారెడ్డి నాలుగోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా నల్లవెల్లి శంకర్, కోశాధికారిగా డాక్టర్ విజయ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇన్‌స్టాలేషన్ అధికారి, మాజీ జిల్లా గవర్నర్ డాక్టర్ విజయ రేకులపల్లి ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ సేవా కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లయన్స్ ఉద్యమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలోనూ, వివిధ విపత్తుల సమయంలోనూ కమాన్‌పూర్ లయన్స్ క్లబ్ అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు. ప్రజా సేవా కార్యక్రమాల్లో ముందుంటూ విద్య, వైద్యం, సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేస్తున్న కమాన్‌పూర్ లయన్స్ క్లబ్ సభ్యులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో రీజినల్ చైర్‌పర్సన్ సోమారపు లావణ్య, జోనల్ చైర్‌పర్సన్ డాక్టర్ లక్ష్మీవాణి, క్లబ్ సభ్యులు చౌడవరపు లింగమూర్తి, బొజ్జ రాజసాగర్, సోప్పరి సంతోష్ కుమార్, తిమ్మరాజు శరత్ కుమార్, సాయిశంకర్, లైశెట్టి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/kamanpur-lions-club-new-executive-committee-election/article-17291

Tags: