ఆర్టీసీ విలీనం ఆలస్యం చేస్తే సమ్మె తప్పదు : హనుమంతు
విశ్వంభర, హైదరాబాదు : ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని వెంటనే ప్రకటించాలని, ఎన్నికల పేరుతో విలీన ప్రక్రియను వాయిదా వేస్తే రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతామని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ హెచ్చరించారు. గురువారం హైదరాబాదు ఆర్టీసీ బస్ భవన్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ ప్రభుత్వంలో విలీనమేనని స్పష్టం చేశారు. యూనియన్ ఎన్నికలకు ముందు విలీన ప్రక్రియ పూర్తి చేసి అపాయింటెడ్ డేట్‌ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికలు నిర్వహిస్తే విలీన ప్రక్రియ మరో రెండేళ్లు ఆలస్యమయ్యే అవకాశం ఉందని అన్నారు. విలీనంతో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు, సౌకర్యాలు, ఉద్యోగ భద్రత, సామాజిక గౌరవం లభిస్తాయని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసి ఉద్యోగుల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన హనుమంతు ముదిరాజ్, సమస్యలను అణచివేతతో కాకుండా పరిష్కారంతో ఎదుర్కోవాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకపోతే విలీనాన్ని కోరుతున్న ఇతర యూనియన్లతో కలిసి సమ్మె కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సోములయ్య, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గోలి రవీందర్, రాష్ట్ర కోశాధికారి పీఎస్‌ఎస్ రావు, రాష్ట్ర కార్యదర్శి జీవన్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో: సిటీ రీజినల్ సెక్రటరీ బుల్లెట్ పాండు మెహిదీపట్నం చైర్మన్ యాకుబ్ ఖాన్ ఫలక్‌నామా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్ వనపర్తి డిపో సెక్రటరీ నాగరాజ్ పాల్గొన్నారు.