ఎమ్మెల్యే చొరవతో బురుజుబావికి నూతన ట్రాన్స్‌ఫార్మర్ 

విశ్వంభర, గుండాల: గుండాల మండలం బురుజుబావి గ్రామంలో విద్యుత్ సమస్యలకు పరిష్కారంగా నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉన్న పాత ట్రాన్స్‌ఫార్మర్ పదేపదే కాలిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి నూతన ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయించారు. నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను గ్రామ సర్పంచ్ వల్లాల రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇమ్మడి దశరథ గుప్త ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. గ్రామానికి అత్యవసరంగా ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేసి విద్యుత్ సమస్య పరిష్కారానికి సహకరించిన ఎమ్మెల్యే బిర్ల ఐలయ్యకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-new-transformer-for-burujubavi-on-the-initiative-of-mla/article-17266

Tags: