విద్యుత్ స్తంభాలు పునర్నిర్మించాలి

విద్యుత్ స్తంభాలు పునర్నిర్మించాలి

విశ్వంభర, అనంతగిరి: విద్యుత్ స్తంభాలు  కూలి విద్యుత్ సరఫరా లేక రైతులు ఇబ్బంది పడుతున్న సంఘటన మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం గత కొద్ది రోజుల క్రితం ఈదురు గాలులు అతివేగంగా వీచడంతో పంట పొలాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు కూలిపోయి స్తంభాలు విరిగిపోయాయని తెలిపారు. విద్యుత్ వైర్లు పంట పొలాల్లో తెగి పడ్డాయని వారు పేర్కొన్నారు.ఈ క్రమంలో విద్యుత్ సరఫరా లేక ఇబ్బంది పడుతున్నట్లు వారు తెలిపారు. పాలేరు వాళ్ళు కింద ఉన్న పంట పొలాలకు మోటార్ల సాయంతో నీళ్ళు అందించి పొలాలు దున్నడానికి నీటి  అవసరానికి విద్యుత్ లేకపోవడంతో రైతుల ఇబ్బంది పడుతున్నట్లు వారు  పేర్కొన్నారు. రోజులు గడుస్తున్న విద్యుత్ అధికారులు తమ సమస్యను పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు.లైన్ మ్యాన్ కి సమాచారం ఇచ్చినా కూడా స్పందించలేదని తెలిపారు.తెగి పడ్డ విద్యుత్ తీగలకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయంపై సంబంధిత విద్యుత్ ఉన్నతాధికారులను  చరవాణి ద్వారా సంప్రదించగా డి ఈ స్పందిస్తూ నేటినుండి ఇది స్తంభాల పునర్ని నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు.ఈ నేపద్యంలో లైన్మెన్ మాట్లాడుతూ ఆ గ్రామంలో అధికంగా స్తంభాలు కూలిపోయాయని ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. విద్యుత్ మరమ్మతుల కాంట్రాక్టర్ అందుబాటులో లేకపోవడంతో స్తంభాల పునర్నిర్మాణం  ఆలస్యమైనట్లు తెలిపారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/electric-poles-should-be-rebuilt/article-17260

Tags: