వస్తా కొండూరులో ఎస్‌ఐఆర్ సర్వే ప్రారంభం

వస్తా కొండూరులో ఎస్‌ఐఆర్ సర్వే ప్రారంభం

  • ఓటర్లకు అవగాహన కల్పించిన బీఎల్‌ఓలు

విశ్వంభర, గుండాల: గుండాల మండలం వస్తా కొండూరు గ్రామంలో ఎస్‌ఐఆర్  సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా బీఎల్‌ఓలు సురుగురు రాజు, యాట రమ గ్రామంలోని యువత, ఓటర్లకు ఓటరు జాబితా సవరణల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ పాంప్లెట్లను పంపిణీ చేశారు. ఓటరు నమోదు, వివరాల సవరణ, కొత్త ఓటర్ల చేర్పు వంటి అంశాలపై ప్రజలకు వివరించి, ప్రతి అర్హుడూ ఓటరుగా నమోదు కావాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగాల అనిల్ కుమార్, ఆర్‌ఐ ప్రభుదాస్, యాట రాజు, బట్టమేకల వెంకన్న, గండికాడి అంజయ్యతో పాటు గ్రామానికి చెందిన పలువురు ఓటర్లు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/start-of-sir-survey-in-vasta-kondur/article-17264

Tags: