ఉపసర్పంచులకు గౌరవ వేతనం ఇవ్వాలి
విశ్వంభర, ముషీరాబాదు : రాష్ట్రంలోని ఉపసర్పంచులకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం ప్రకటించాలి, చెక్ పవర్ రద్దుపై వస్తున్న వదంతులను ప్రభుత్వం వెంటనే ఖండించి స్పష్టత ఇవ్వాలి, డిమాండ్లు పరిష్కరించకపోతే చలో సచివాలయం కార్యక్రమంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉపసర్పంచుల ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ హెచ్చరించారు. హైదరాబాదు ఇందిరాపార్క్ ధర్మచౌకు వద్ద గురువారం ఉపసర్పంచుల ఫోరం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 వేలకుపైగా ఉపసర్పంచులకు గౌరవ వేతనం కల్పించాలని, వార్డు సభ్యులకు నెలకు రూ.3 వేల గౌరవ వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల్లో ఉపసర్పంచులకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, దీనిపై ప్రభుత్వం అధికారికంగా స్పందించాలని కోరారు. అభివృద్ధి పనుల శిలాఫలకాలపై సర్పంచ్, ఉపసర్పంచ్, సంబంధిత వార్డు సభ్యుల పేర్లు పొందుపర్చాలని అన్నారు. పంచాయతీ స్టాండింగ్ కమిటీల్లో ఉపసర్పంచులకు వైస్ చైర్మన్ హోదా కల్పించడంతో పాటు, పంచాయతీ తీర్మానాలపై సర్పంచ్, కార్యదర్శితో పాటు ఉపసర్పంచ్ కూడా సంతకం చేసే అధికారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై స్పందించకపోతే జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు, కలెక్టరేట్ల ముట్టడులు, చలో సచివాలయం కార్యక్రమాలు చేపట్టి ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో: రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కటకం స్వప్ప ఉపాధ్యక్షురాలు మామిడి కవిత కుమార్ జి శ్రీనివాస్ పాషా అధికార ప్రతినిధి కమలాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శులు ఎం శ్రీనివాస్ ఎం నరేష్ సీహెచ్ కరుణాకర్ మహేష్ గౌడ్ కార్యదర్శులు జంపన్న సురేష్ శ్రావణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.