విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడితే లక్ష మందితో ఆమరణ నిరాహార దీక్ష: ఆర్. కృష్ణయ్య

విశ్వంభర, హైదరాబాదు : జీవో నంబర్ 8, 9లను వెంటనే రద్దు చేసి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే జూలైలో లక్ష మంది విద్యార్థులతో ఆమరణ నిరాహార దీక్షతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. హైదరాబాదులోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తిచేసుకున్న లక్షలాది మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందకపోవడంతో ఉద్యోగాలు, ఉన్నత విద్య అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడం వల్ల కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నాయని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 8, 9లతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర అయోమయం నెలకొందని విమర్శించారు. ఫీజులు విద్యార్థులే ముందుగా చెల్లించాలని ఒత్తిడి తెచ్చే పరిస్థితులు ఏర్పడతాయని, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఇది భారంగా మారుతుందని పేర్కొన్నారు. గత 18 సంవత్సరాలుగా అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు, కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరపాలని కోరారు. సమస్య పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి లక్ష మంది విద్యార్థులతో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. విద్యార్థుల విద్య, ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, జీవో నంబర్ 8, 9లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో: బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ నాయకుడు పగిళ్ల సతీష్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ అనంతయ్య మోడీ రాందేవ్ బలరాం నాయక్ మల్లేష్ యాదవ్ సిద్దు యాదవ్, రాజేందర్ ,బలరాం నాయక్ , మల్లేష్ యాదవ్ , సిద్దు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/r-krishnaiah-will-go-on-hunger-strike-with-one-lakh/article-17270

Tags: