ట్రాయ్ ఆధ్వర్యంలో టెలికాం వినియోగదారుల అవగాహన సదస్సు

 విశ్వంభర,   హుస్నాబాద్: టెలికాం వినియోగదారుల హక్కులు, టెలికాం సేవలు, సైబర్ మోసాలు మరియు వాటి నివారణపై అవగాహన కల్పించేందుకు గురువారం హుస్నాబాద్ వైశ్య భవన్‌లో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, అంగన్‌వాడీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది, కేబుల్ ఆపరేటర్లు, వినియోగదారుల ఫోరమ్ ప్రతినిధులు, టెలికాం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ట్రాయ్ హైదరాబాద్ జాయింట్ అడ్వైజర్ కె.వి. సురేష్‌బాబు మాట్లాడుతూ అవాంఛిత కాల్స్, స్పామ్ సందేశాల నియంత్రణ, టెలికాం ఫిర్యాదుల పరిష్కారం, మొబైల్ నంబర్ పోర్టబిలిటీ, సేవల నాణ్యత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే ‘మై కాల్’, ‘మై స్పీడ్’, ‘డీఎన్‌డీ’ వంటి ట్రాయ్ యాప్‌ల వినియోగంపై వివరించారు. ఆర్డీవో వి. రామ్మూర్తి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. హుస్నాబాద్ ఏసీపీ ఎస్. సదానందం సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్థిక మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ టి. మల్లికార్జున్ మాట్లాడుతూ వినియోగదారుల్లో హక్కులు, భద్రతపై అవగాహన పెంపొందించడం అవసరమన్నారు. డీఓటీ అసిస్టెంట్ డైరెక్టర్ డి. మధుకర్ సైబర్ మోసాల నివారణకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. కార్యక్రమం ముగింపులో ట్రాయ్ కన్సల్టెంట్ ఎ. కిష్టయ్య పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/telecom-consumer-awareness-conference-organized-by-trai/article-17278

Tags: