యువత విద్యతోపాటు వ్యాపార రంగాల్లో రాణించాలి
On
విశ్వంభర, గాంధీనగర్: హైదరాబాదు గాంధీనగర్ డివిజన్ శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ వీధిలో ఏర్పాటుచేసిన రియాస్ వరల్డ్ చిల్డ్రన్స్ టాయ్స్ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ ను కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుర్రం శంకర్ , చంద్రకళ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువత విద్యతోపాటు వ్యాపార రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ విధంగా వ్యాపారాల సంస్థను ఏర్పాటుచేసి మరి కొంతమందికి ఉపాధి కల్పిస్తున్న యువతను అభినందించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ జాకీర్, గడ్డం రాజేష్ , శ్రీనివాస్ రెడ్డి, ఇమ్మరాజు నవీన్ కుమార్ కృష్ణ యాదవ్ , బోనం ఊర్మిళ, స్వరూప, బండారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



