అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభం
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ లో 8వ వార్డు లో 4 లక్షల రూపాయల గ్రామ పంచాయతీ నిధులతో నూతన అండర్ గ్రౌండ్ డ్రైనెజీ నిర్మాణ పనులు ప్రారంబించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి వార్డులో సీసీ రోడ్డు పనులు, డ్రైనేజీ పనులు పెండింగ్ లో ఉన్న ప్రతి వార్డులో వార్డ్ మెంబర్స్ తమ తమ వార్డులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమములో సర్పంచ్ నవీన్, ఉప సర్పంచ్ జొరల రమేశ్ , వార్డు మెంబర్స్ తింగిరికారి బేబీ, పోల్కం సునీత, ఆవులకాడి కిష్టామ్మ, స్వర్ణగంటి సంజీవ, మహమ్మద్ ఆజం, కడమోని స్వాతి, వత్తుల శాలిని, కాకి పరమేష్, దిద్దెల శ్రీశైలం, ఆకుల వీరిబాబు, సున్నం స్వప్నా, జటావత్ రుకేష్, రెవెళ్ళ చంద్రమౌళి, పంచాయతి కార్యదర్శి సుజాత, స్వర్ణగంటి ఆనందం బి ఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కటికల మహేందర్ ముదిరాజ్, పిఎసిఎస్ డైరెక్టర్ కాడమోని ప్రభాకర్, మక్కాజి దుడ్డు కృష్ణ యాదవ్, కట్నం పర్వతాలు, కటికల పరమేష్, సున్నం కృష్ణ, దయానందగౌడ్ ఆవుల కాడి శ్రీశైలం మిద్దింటి, సిద్దు, కడమోని బాలయ్య, రిజ్వాన్, మహేష్ బాబు, గాజుల రాజు, పల్లె మోని నరసింహ, రవి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.



