ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి 

ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి 

విశ్వంభర,  సంగారెడ్డి: విశ్వ గురువు, సంఘ సంస్కర్త మహాత్మా బసవేశ్వర జయంతిని  సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న బసవేశ్వర చౌక్ వద్ద ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర పాల్గొని మాట్లాడుతూ, మహాత్మా బసవేశ్వరుడు సామాజిక న్యాయం, వివక్షలేని సమాజం కోసం కృషి చేసిన మహోన్నత సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు. “కాయకమే కైలాషం” అనే సిద్ధాంతంతో పని పట్ల గౌరవాన్ని పెంపొందించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన ఆధ్యాత్మిక తత్వవేత్తగా ఆయన నిలిచారని అన్నారు. నేటి యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్, సహా కార్యదర్శి పాండురంగం, కార్యవర్గ సభ్యులు రాజు మార్కుంది, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: