ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎంపీ  కడియం కావ్య 

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎంపీ  కడియం కావ్య 

విశ్వంభర, హనుమకొండ : హనంకొండ జిల్లా హసన్ పర్తి మండలం, సీతం పేట గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను స్థానిక శాసన సభ్యులు కె.ఆర్  నాగరాజు, డిసిసి అధ్యక్షులు కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి తో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రజా పాలనలో నిరుపేదలకు సొంతింటి కల సహకారం చేయటానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిందన్నారు. మొదటి విడతలో మంజూరైన   ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు పూర్తిచేసి, ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు.

Tags: