హనుమకొండలో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ బ్రాంచ్
విశ్వంభర, హనుమకొండ: తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో, దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన ఫిజిక్స్ వాలా విద్యాపీట్ ఐఐటీ,జేఈఈ, నీట్ ఫౌండేషన్ నూతన బ్రాంచ్ ను హనుమకొండ నక్కలగుట్టలో ప్రారంబించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిట్ వరంగల్ డైరెక్టర్ డాక్టర్ బిద్యాధర్ సుభూధి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు నాణ్యమైన విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అత్యుత్తమ ఫ్యాకల్టీ, ఆధునిక సౌకర్యాలు, ప్రణాళికాబద్ధమైన బోధనతో ఈ బ్రాంచ్ ప్రత్యేకంగా నిలువాలని ఆకాంక్షించారు.సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.డబ్లు సెంట్రల్ అమిత్ రాథోర్ పాల్గొని క్లాస్ రూమ్ ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు.వరంగల్లో హైదరాబాద్లో ఉన్నట్లే ఐఐటీ జేఈఈ, నీట్ ఫౌండేషన్ కోర్సు తీసుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సంస్థ కట్టుబడి ఉందనన్నారు.అనంతరం సంస్థ సీఈవో డాక్టర్ ఇరుకుల్ల మునీందర్ ఆధ్వర్యంలో క్లాస్‌రూమ్ బోధనతో పాటు ఫిజిక్స్ వాలా యాప్ ద్వారా లెక్చర్స్ అప్‌లోడ్ చేయబడతాయని తెలిపారు.విద్యార్థులు తమ సందేహాలను 24 గంటల పాటు క్లియర్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం చేయుటలో ప్రముఖ పాత్ర వహించిన శ్రేయోభిలాషులకు తల్లిదండ్రులకు విద్యార్థులకు జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు.



