సిరిపురం గ్రామ లింకు రోడ్లను బిటి రోడ్లుగా మార్చాలి
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, సిరిపురం గ్రామం నుండి ఇతర గ్రామాలకు వెళ్లే అంతర్గత పంచాయతి రాజ్ రోడ్లను బిటి రోడ్డుగా మార్చి ప్రజల సమస్య పరిస్కరించాలని సిపిఎం జిల్లా కమిటి సభ్యుడు బల్గురి అంజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పోరు యాత్రలో భాగంగా గ్రామ సిపిఎం నాయకులతో కలసి వెలిమినేడు, పెద్దకాపర్తి, తుమ్మలగూడెం రోడ్లను పరిశీలించి అనంతరం మాట్లాడుతూ, ప్రధాన రహదారులైన రోడ్లు గుంతల మాయంగా మారి ప్రయాణాలు ఇబ్బందిగా మరాయని, దశబ్దాల కాలంగా ప్రజలు కోరుతున్న ప్రభుత్వాలు స్పందించడం లేదని వాయారు. వెంటనే బిటి రోడ్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి అంబటి మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీలు బడుగు రమేష్, రాపోలు ప్రభాకర్, కూనూరు వెంకటేశం, వార్డు సభ్యులు మొటే స్వామి, జెల్ల శ్రీనాధం, సంగిశెట్టి మహేష్, గ్రామ నాయకులు కూనూరు గణేష్, కంకల నరసింహా, బల్గురి నరసింహా, కందుల మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



