రైతు సంక్షేమం కోసం సీఎం కృషి
On
విశ్వంభర, సిద్దిపేట: సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్నారని చిన్నకోడూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ మీసం మహేందర్ కొనియాడారు. చిన్నకోడూరు మండలంలోని మేడిపల్లి, చౌడరాం, ఎల్లమ్మజాలు, చెల్కలపల్లి, అల్లీపూర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు సెంటర్లను ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లతో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ తేమ శాతం రాగానే ఐకేపీ సిబ్బంది వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి లోటు ఉండొద్దని చెప్పారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



