పదోన్నతులు బాధ్యతను మరింత పెంచుతాయి

పదోన్నతులు బాధ్యతను మరింత పెంచుతాయి

  •  సీపీ సాయిచైతన్య 

విశ్వంభర, నిజామాబాద్ : పోలీస్​శాఖలో పదోన్నతులు బాధ్యతను మరింత పెంచుతాయని సీపీ సాయిచైతన్య  పేర్కొన్నారు. ఈ మేరకు నలుగురు కానిస్టేబుళ్లు హెడ్​ కానిస్టేబుళ్లుగా పదోన్నతి రాగా వారిని సీపీ కార్యాలయం లో అభినందించారు. ఈ సందర్భంగా నలుగురు కానిస్టేబుళ్లకు సీపీ బ్యాడ్జ్​లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. డీజీపీ ఆదేశాల ప్రకారం  వారికి పదోన్నతులు లభించాయన్నారు. ప్రమోషన్​ తర్వాత మరింత నిక్కచ్చిగా బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. వర్ని పోలీస్​స్టేషన్​ కానిస్టేబుల్​ కె.ఆనంద్, 2వ టౌన్​ పోలీస్ స్టేష,న్​లో సతీష్, ధర్పల్లి పోలీస్​స్టేషన్​లో కె.నవీన్ కుమార్, వన్​టౌన్​లో శశిప్రసాద్​లు హెడ్​కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు.

Tags: