జర్నలిస్టు ప్రసాద్ కు కాంగ్రెస్ నేతల పరామర్శ

జర్నలిస్టు ప్రసాద్ కు కాంగ్రెస్ నేతల పరామర్శ

విశ్వంభర, నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల జర్నలిస్ట్ సింగరం ప్రసాద్ కు ఇటీవల పితృవియోగం జరిగింది.సమాచారం తెలుసుకున్న బ్లాక్ కాంగ్రెస్,మండల పార్టీ అధ్యక్షులు ఎదల్ల యాదవ రెడ్డి, గొల్లెపల్లి ప్రభాకర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి హెచ్చు వెంకటేశ్వర్లు తదితరు లు తొర్రూరు మండలం గుర్తూరు కు వెళ్ళి స్వర్గీయ సింగరం శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.జర్నలిస్ట్ ప్రసాద్ తో పాటు ఆయన సోదరులను కుటుంబ సభ్యులను పరామర్శించారు.శ్రీనివాస్ ఆకస్మిక కన్నుమూత ఎంతో కలచివేసింది అని విచారం వ్యక్తం చేశారు.ఈ ఆపత్కాల సమయంలో ధైర్యంగా ఉండాలని,అండగా ఉంటామని ధైర్యవచనాలు చెప్పారు. వారితోపాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

Tags: