హుండీ ని  మాయం చేసిన వ్యక్తి పై ఫిర్యాదు 

హుండీ ని  మాయం చేసిన వ్యక్తి పై ఫిర్యాదు 

విశ్వంభర, అనంతగిరి:  దేవాలయంలో హుండీ ని  మాయం చేసిన సంఘటన మండల పరిధిలోని గొండ్రియాల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఉమామహేశ్వర దేవాలయంలో పురాతన  హుండీనీ గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేశారు. ఈ విషయంపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హుండీ అపహరించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేసారు. ఈ క్రమంలోనే సోమవారం వారు జిల్లా ఎండోమెంట్ సహాయ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని ఉమామహేశ్వర దేవస్థానంలో పూజా సామాగ్రి అయిన తాంబూలం ,చెంబు తో పాటు దేవుని హుండీ నీ ఆ దేవాలయ కమిటీ మెంబర్ గా ఉన్న ఓ వ్యక్తి అమ్ముకున్నాడని వారు పేర్కొన్నారుఆరోపించారు. ఈ విషయంపై సంబంధిత వ్యక్తిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.

Tags: