అంగనవాడి సెంటర్లో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ 

అంగనవాడి సెంటర్లో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ 

విశ్వంభర, కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని గిర్ని తండా, అంగన్వాడి సెంటర్ లో  గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నఉపాధ్యాయుడు సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ఇది కేవలం కళాశాలలో మాత్రమే జరుపుకునేవారు వాటికి దీటుగా అన్ని ప్రభుత్వ అంగన్వాడి స్కూళ్లలో కూడా గ్రాడ్యుయేషన్ డే జరుపుకోవడం విశేషమన్నారు. పిల్లలకు ఎంతో ఉత్సాహాన్ని నింపే కార్యక్రమం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రమాదేవి, తల్లిదండ్రులు కిషోర్ బాలికలు, ఆయాలు వెంకటలక్ష్మి, కవిత, తదితరులు పాల్గొన్నారు.

Tags: