రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది

రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది

విశ్వంభర, సిద్దిపేట: రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామ సర్పంచ్ గోపాలపురం భానుచందర్ కోరారు. గ్రామంలోని ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఉప సర్పంచ్ కోడి రాజు, ఎపీఎం అలీతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భాను మాట్లాడుతూ ఐకేపీ సిబ్బంది కటింగ్ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. కేంద్రానికొచ్చిన వడ్లను వెంటవెంటనే కొనుగోలు చేయాలన్నారు. కేంద్రంలో రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకుని నష్టపోవద్దని గోపులాపూర్ సర్పంచ్ కొట్టె రాజు అన్నారు. గ్రామస్తులతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. గుర్రాలగొందిలో సర్పంచ్ ఆకుల స్పప్న హరీశ్ ఎపీఎం అలీ, గ్రామ కెబినెట్ మంత్రులతో కలిసి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కోదండరావుపల్లి గ్రామ సర్పంచ్ గ్యాదపాక పద్మ బాబు ఐకేపీ సిబ్బంది, గ్రామ నాయకులతో కలిసి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. కార్యక్రమాల్లో గ్రామాల ఎఈవోలు, సీసీలు, పంచాయతీ సెక్రటరీలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags: