అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచన పోటీలు
విశ్వంభర, రామన్నపేట: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని డాన్ బోస్కో పాఠశాలలో విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ముందుగా అగ్ని ప్రమాదాల నివారణకై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఫైర్ ఆఫీసర్ బి.మధుసూదన్ రెడ్డి విద్యార్థులకు వివరించారు. అకస్మాత్తుగా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని ఎలా నియంత్రించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా వేసవికాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ బి.మధుసూదన్ రెడ్డి, లీడింగ్ ఫైర్ ఫైటర్ డి.రామ్ నర్సయ్య, అగ్నిమాపక సిబ్బంది మీర్జా షఫీ భేగ్, మహేశ్వరం పాండు, దావునూరి గోపాల్, చలమల్ల మధు, పాఠశాల కరస్పాండెంట్ జానీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



