సీసీ రోడ్డు పనులు ప్రారంభం 

సీసీ రోడ్డు పనులు ప్రారంభం 

విశ్వంభర, షాబాద్: షాబాద్ మండల కేంద్రంలోని  చందనవెల్లి గ్రామంలోని కొత్త కాలనీలో అభివృద్ధి పనులకు గ్రామ సర్పంచ్ నవనీత స్వామి నేతృత్వంలో శ్రీకారం చుట్టారు. కాలనీ ఏర్పడి దాదాపు 15 సంవత్సరాలు కావస్తుండగా, మొదటిసారిగా సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం విశేషం. బటిగారి అడివయ్య ఇంటి నుంచి సోమని రాములు ఇంటి వరకు సుమారు 150 మీటర్ల పొడవున సీసీ రోడ్డు నిర్మాణానికి సర్పంచ్ నవనీత స్వామి ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ శ్రీశైలం, వార్డు సభ్యులు శ్రీహరి, వెంకటేష్, సాయి కిరణ్, గీత యాదయ్య, భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న రోడ్డు పనులకు శ్రీకారం చుట్టినందుకు సర్పంచ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నవనీత స్వామి మాట్లాడుతూ, కాలనీలో తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు, రోడ్లు వంటి మౌలిక వసతులను దశలవారీగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా కృషి జరుగుతోందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అత్యవసర పరిస్థితులు తప్ప బయటికి రావద్దని హెచ్చరించారు. “మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు కిష్టయ్య, సుధాకర్ రెడ్డి,  గోపాల్, శ్రీకాంత్ రెడ్డి, రామస్వామి, మహేష్, రాజమల్లు, రామచందర్, పాండు, మల్లేష్, రవి, రాములు, అడివయ్య, శివ, వరప్రసాద్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: