15 రోజుల్లో తారు రోడ్డు పనులు చేపట్టాలి

15 రోజుల్లో తారు రోడ్డు పనులు చేపట్టాలి


  • జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నా

విశ్వంభర, ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని మీట్యా తండా నుంచి పంతులు తండా మీదుగా ఎర్రబెల్లి గూడెం రోడ్డు వరకు 15 రోజుల్లో తారు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ ఆదేశించారు. గత రెండున్నర సంవత్సరాల క్రితం సంబంధిత రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ పూర్తి కాకపోవడం పై మీట్య తండాకు చెందిన బిజెపి జిల్లా యువ నాయకులు గుగులోతు నవీన్ నాయక్ మూడు నెలల క్రితం హుస్సేన్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు. దీంతో హైదరాబాద్ దిల్సుఖ్ గెస్ట్ హౌస్ లో సోమవారం హుస్సేన్ నాయక్ విచారణ చేపట్టారు.కలెక్టర్ కార్యాలయం, పంచాయతీ కార్యాలయంనుంచి సంబంధిత డిఈ అధికారులు హాజరై కాంట్రాక్టర్ తీరుతో నే ఆలస్యమైందని వివరణ ఇచ్చారు.కాంట్రాక్టర్ ను రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్ తో నైనా ప్రస్తుత  కాంట్రాక్టర్ తో నైనా  పనులు మొదలుపెట్టి వేగంగా పూర్తి చేయాలని హుస్సేన్ నాయక్ అన్నారు.

Tags: