పుల్లెంల గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం.
On
విశ్వంభర, చండూర్:- పుల్లెంల గ్రామ ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించాలని తాను పుట్టిన గ్రామానికి సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వచ్చిన దాత (అడ్వకేట్) వడ్డగాని రవికుమార్ తన సొంత నిధులతో నూతన గ్రామ పంచాయతీ భవనం దగ్గర వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి నేడు ప్రారంభించారు. సురక్షిత త్రాగునీటిని అందించారని గ్రామస్థులు దాత రవికుమార్ గారిని సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో దాత కుమారులు హేమ్ చందర్ ,దుర్గ ప్రసాద్ ,సర్పంచ్ ముక్కముల వెంకన్న,ఉప సర్పంచ్ చెడుబుద్ధి ఉషయ్య, మాజీ ఎంపీటీసీలు సీత యాదయ్య,వడ్డగాని రాఘవేందర్ గ్రామ పెద్దలు మందడి శంకర్ రెడ్డి,గోపిడి వెంకట్ రెడ్డి,వడ్డగాని చంద్రశేఖర్ గౌడ్ ,లగ్గోని దశరథ,భూతరాజు బాలరాజు,పాలకూరి రాములు,ఇరిగి బుచ్చయ్య,ముక్కముల నర్సింహ్మ,కొల్లోజు మాధనచారి,నడికూడ వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.



