ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి
విశ్వంభర, నిజామాబాద్ : మహాత్మా బసవేశ్వర 895 జయంతిని బీర్కూర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దామరంచ భూషణం స్వామి మాట్లాడుతూ, బసవేశ్వరుడు గొప్ప సామాజిక సంస్కర్త తత్వవేత్త 12వ శతాబ్దంలోని గొప్ప విప్లవాలను సృష్టించినటువంటి విప్లవకారుడు, సమాజంలో కుల మతాలు లేవు అందరూ సమానులే ఒకటి స్త్రీ కులం రెండు పురుష కులం రెండే రెండు కులాలు ఉన్నాయని చెప్పి మొట్టమొదటిసారిగా స్త్రీలను కూడా సమాన హక్కును కల్పించినటువంటి వ్యక్తి బసవేశ్వరుడు అని అన్నారు. ఎన్నో సామాజిక విప్లవాలు సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పార్లమెంట్ వ్యవస్థను సృష్టించినటువంటి వ్యక్తి బసవేశ్వరుడు అని కొనియాడారు. ఆ మహానుభావుడు జయంతి సందర్భంగా ఈరోజు అంగరంగ మహా వైభవంగా బీర్కుల్లో జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ గ్రామ పెద్దలు, నాయకులు, లింగాయత్ సమాజ్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



