పెరుగుతున్న ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
On
విశ్వంభర, బలపాల: వేసవి ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బలపాల ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ స్రవంతి తెలియజేశారు. ముఖ్యంగా 12 గంటల 30 నిమిషాల నుండి మూడు గంటల వరకు బయటకు వెళ్లకుండా అత్య అవసరమయయితే తప్ప బయటకు వెళ్లకుండా ఉండడం మంచిది, వృద్ధులు, వికలాంగులు చిన్నపిల్లలు బయటకు రాకుండా చూసుకోవాలని చెప్పారు. ఓ ఆర్ ఎస్, నిమ్మరసం, మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి, వడగాలులు తగలకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు.



