ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా కార్యకర్తలు పనిచేయాలి
- కాకి ఈశ్వర్ ముదిరాజ్
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని కాకి ఈశ్వర్ ముదిరాజ్ ఫంక్షన్ హాల్లో జరిగిన, మహేశ్వరం పట్టణ శాఖ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ఒక్క పథకం ప్రజలకు చేరవేసేలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పని చేయాలని అన్నారు. నూతనంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేవారు దరఖాస్తులు పెట్టుకోవచ్చని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ప్రతి గ్రామంలో నుండి కార్యకర్తలు నాయకులు కష్టపడి పనిచేసే సముచిత స్థానాలు లభిస్తాయని అన్నారు. అలాగే నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా కు నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్, శివగంగా ఆలయ కమిటీ చైర్మన్ అల్లే కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మొహమ్మద్ అబ్దుల్ జావిద్, ఆల్లె బిక్షపతి,పట్టణ శాఖ అధ్యక్షులు బంగారిగల్ల లాజర్, ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా, వార్డ్ మెంబర్స్ టీ బేబీ మక్కాజి, వత్తులశాలిని సన్నీ కుమార్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కర్రెల రాములు ముదిరాజ్, స్వర్ణగంటి సుభాష్, శివగంగా ఆలయ కమిటీ డైరెక్టర్లు పోతర్ల తిరుపతయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి రామచంద్రయ్య ముదిరాజ్, సేవాదళ్ నియోజకవర్గ అధ్యక్షులు గదగూటి హరికృష్ణ ముదిరాజ్, మండల అధ్యక్షుడు శెట్టి అశోక్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ మండల చైర్మన్ మొహమ్మద్ ఇర్షాద్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు స్వర్ణ గంటి ఆకాష్, 10వ వార్డు ఇన్చార్జి కాకి మల్లేష్ ముదిరాజ్,13 వ వార్డ్ ఇన్చార్జ్ మూనావత్ అనిల్ నాయక్,14 వ వార్డ్ ఇన్చార్జ్ పుట్ల గారి చందు, పార్టీ సీనియర్ నాయకులు మోతే యాదయ్య, అల్లే బాలేష్, ఏపూరి రాజు, ఏపూరి నరసింహ, గగనం ఆంజనేయులు, దూసకంటి రవీందర్, యువజన కాంగ్రెస్ నాయకులు ముచ్చింతల శ్రీను, పినామౌని శ్రీకాంత్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.



