షార్ట్ ఫిలిమ్స్‌పై వర్క్ షాప్

షార్ట్ ఫిలిమ్స్‌పై వర్క్ షాప్

విశ్వంభర, సిద్దిపేట: షార్ట్ ఫిలిమ్స్, సినిమా రంగాల్లో రాణించాలనుకునే వారి కోసం 30రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని మూవీ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చిరంజీవి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ నాయకులతో కలిసి మాట్లాడారు. ఈనెల 26 నుంచి కార్యక్రమానికి సంబంధించిన పేర్ల నమోదు కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు మోర్ సూపర్ మార్కెట్ వెనకనున్న వేద సొల్యూషన్స్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఫిలీం మేకింగ్‌లోని 24 డిపార్ట్మెంట్లపై వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని, సిద్దిపేట పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్ నాయకులు నర్సింలు, లింగమూర్తి, శ్రావణ్, స్వామి చరణ్, హరీశ్, నవీన, కనకలక్ష్మి, సుభాశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: