రైతు భరోసా రెండో విడత విడుదల
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని రైతు వేదికలో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా రెండో విడత విడుదల చేస్తున్న సందర్భంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని అప్సియా బేగం, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లే బిక్షపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్, శివగంగ ఆలయ కమిటీ చైర్మన్ అల్లే కుమార్,పట్టణ శాఖ అధ్యక్షులు బంగారుగళ్ల లాజర్, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా, ఇందిరమ్మ కమిటీ సభ్యులు స్వర్ణగంటి సుభాష్,సేవాదళ్ అధ్యక్షులు గదగూటి హరికృష్ణ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం 14 వ ఇన్చార్జ్ పొట్లగారి చందు, 10వ వార్డు ఇన్చార్జి కాకి మల్లేష్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గగనం ఆంజనేయులు, పినమోని శ్రీకాంత్ ముదిరాజ్, రైతులు తడకల భాస్కర్, భాను ప్రకాష్, కర్రల ప్రవీణ్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.



