అంగన్వాడీలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే#

అంగన్వాడీలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే#

విశ్వంభర, నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామంలోని అంగన్వాడి సెంటర్-2లో సోమవారం ఘనంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు.ఆ గ్రామ ఉపసర్పంచి తాల్లపెల్లి వెంకన్న గౌడ్ హాజరై మాట్లాడుతూ తొలి విద్యాదశ (ప్రీ స్కూల్) దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో నిర్వహించే గ్రాడ్యుయేషన్ డే చిన్నారుల్లో ఉత్సాహం నింపుతుందన్నారు. ఇకనుంచి చదివే చదువులు అత్యంత ప్రతిభావంతంగా ఉండి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఎల్తూరీ సునీత,ఏఎన్ఎం శోభా,ఆయాలు, పిల్లల తల్లి తండ్రులు పాల్గొన్నారు.

Tags: