ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు


విశ్వంభర, కేసముద్రం: భారతీయ జనతా పార్టీ  47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని, సోమవారం స్థానిక జ్యోతిరావు పూలే సెంటర్లో మండల పార్టీ అధ్యక్షులు ఉప్పునుతల రమేష్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 6, 1980న అటల్ బిహారీ వాజ్‌పేయి గారి నాయకత్వంలో ఆవిర్భవించిన బీజేపీ, 2 సీట్ల నుండి నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా  ఎదిగిందని కొనియాడారు. శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వంటి మహనీయుల ఆశయాలతో, దేశం పట్ల ప్రేమ, దేశ ప్రజల పట్ల అంకితభావం అనే సిద్ధాంతాలే ఆలంబనగా బీజేపీ ముందుకు వెళ్తోందని ,దేశాభివృద్ధే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పార్టీ దూసుకుపోతోందని పేర్కొన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు పొదిల నరసింహారెడ్డి మాట్లాడుతూ మండలంలోని ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పనిచేసి, పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఓలం శ్రీనివాస్, రామడుగు వెంకటాచారి, పైండ్ల శీను , మండల ప్రధాన కార్యదర్శులు బోగోజు నాగేశ్వర చారి, భువనగిరి ఉపేందర్,  మండల ఉపాధ్యక్షులు నగరబోయిన చంద్రకళ , చెలగొల్ల వెంకన్న, మండల నాయకులు బచ్చు లక్ష్మీనారాయణ ,గాంతి వెంకట్ రెడ్డి, అయిత సారయ్య , మల్యాల రాములు, జుజ్జూరు వీరభద్ర చారి, జంగిటి అనిల్ ,గుండు దామోదర్, చక్రధర్,బానోత్ రాము,ధరావత్ రంగమ్మ, భేతి వెంకన్న, బచ్చు సవీన్, బానోత్ రమేష్, బానోత్ సంపత్, భాస్కర్, పరకాల మురళి, బొద్దుల సతీష్, భరత్ మండల బీజేపీ ముఖ్య నాయకులు, శక్తి కేంద్రాల ఇంచార్జ్ లు, మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

పొట్టి శ్రీరాములు సెంటర్ లో..

Read More మహబూబాబాద్ లో బిజెపి  ప్రచారం 

కేసముద్రం పట్టణ కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ వద్ద భారతీయ జనతా పార్టీ  ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కన్వీనర్ బొగోజు నాగేశ్వర చారి పార్టీ జెండాను ఎగురవేశారు. కోరుకొండపల్లి గ్రామంలో బీజేపీ పార్టీ జెండాను బూత్ అధ్యక్షుడు బేతి వెంకన్న ఆవిష్కరించి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నాయకులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు బోగోజు నాగేశ్వర చారి, భువనగిరి ఉపేందర్,  నాయకులు జంగిటి అనిల్, వెలిశాల సావిన్, మల్యాల రాములు, ముదిరెడ్డి మురళీధర్ రెడ్డి, మంగిశెట్టి నాగన్న, పోలెపల్లి సంపత్ రెడ్డి ,పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: