ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

 విశ్వంభర,  అనంతగిరి: అనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం తహసిల్దార్ హిమబిందు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులు ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని, మధ్యవర్తుల ద్వారా నష్టపోకుండా నేరుగా ధాన్యం విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎం ఎస్ పి) ప్రకారం రైతులకు లాభం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.కేంద్రంలో ధాన్యం తూకం, చెల్లింపుల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఏవో దేవపంగు ప్రసాద్, సర్పంచ్ కంటూ లాజర్, ఉపసర్పంచ్ గింజుపల్లి జగన్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కనగాల వీరయ్య, మండల ప్రధాన కార్యదర్శి జొన్నలగడ్డ కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ గాదె వెంకన్న, సీఈఓ ఉయ్యాల నాగేశ్వరరావు, నాయకులు గింజుపల్లి సురేష్, సిబ్బంది వీరయ్య, మాధవి తదితరులు, రైతులు పాల్గొన్నారు.

Tags: