సంక్షేమం అభివృద్ధి కి కట్టుబడి ఉన్నాం
- ఇందిరమ్మ ఇండ్లు వేగంగా పూర్తి చేయాలి
- వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి
- గ్రామ సభలల్లో ఎమ్మెల్యే మురళి నాయక్
విశ్వంభర, ఇనుగుర్తి: రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడం ప్రజలకు సంక్షేమం చేకూర్చడం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ అన్నారు. పేదల నివాసానికి ఇందిరమ్మ ఇండ్లు,ఆకలి తీర్చడానికి కొత్త రేషన్ కార్డులు,సన్న బియ్యం, రైతు రుణమాఫీ,మహిళలకు ఫ్రీ బస్సు, గృహాలకు ఉచిత విద్యుత్,రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంపు, మహిళలకు జీరో వడ్డీ రుణాలు, రైతుల పంటలకు మద్దతు ధర, రైతు భరోసా వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలో ఇనుగుర్తి సర్పంచి తమ్మడపల్లి కుమార్, లాలు తండ భూక్య లక్ష్మి,రాము తండా భూక్య మీటు నాయక్ ల అధ్యక్షతన సోమవారం జరిగిన గ్రామ సభలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్తుల సమస్యలను విన్నారు.ఆయా శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. విద్యుత్ ఏఈ హాజరు కాకపోవడంతో మెమో జారీ చేయాలని ఆదేశించారు.ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన కట్టుకొని లబ్ధిదారుల నుంచి రాతపూర్వకంగా తీసుకొని అర్హులైన ఇతరులకు కేటాయించాలన్నారు. నీటి సమస్య గల గ్రామాలలో యుద్ధ ప్రాతిపదికన బోర్లు వేయాలని అధికారులకు సూచించారు. ఇనుగుర్తి నుంచి అన్నారం వైపు వెళ్లే రహదారి గుంటి చెరువు చివర రోడ్డుపై రెండు వాహనాలు ఒకేసారి వెళ్ళే విధంగా బ్రిడ్జి మంజూరి చేయనున్నట్లు తెలిపారు. ఇనుగుర్తి నుంచి చిన్న ముప్పారం మీదుగా మహబూబాబాద్ కు వెళ్లే రోడ్డు పనులు సాంక్షన్ చేయిస్తామన్నారు. ఇనుగుర్తి మండల పరిషత్,తహసిల్దార్ తదితర ఆఫీసులతోపాటు ఏటిసి నిర్మాణానికి త్వరగా భూమి సమకూర్చాలన్నారు.కార్యక్రమంలో తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఎంపీడీవో పార్థసారథి,ఎంఈఓ రూప రాణి, ఏవో మహేందర్,దిశ కమిటీ సభ్యులు బాబురావు, ఏఎంసీ డైరెక్టర్ కొట్టం రాము వివిధ గ్రామాల సర్పంచులు,ఉపసర్పంచ్ లు,వార్డు సభ్యులు పంచాయితీ కార్యదర్శి లు,వివిధ పార్టీల నాయకులు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.



