రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట నియోజకవర్గ అభివృద్దే ఏకైక లక్ష్యంగా పని చేస్తున్నానని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని 8వ వార్డు(కుసుమవారిగూడెం) లో ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. 3 లక్షల వరకు రుణ మాఫీ, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సహాయం, సన్నాలకు బోనస్, మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, వ్యవసాయ యాంత్రికరణకు 50 సబ్సిడీ వంటి పథకాలను అమలు చేస్తూ రైతుకు అండగా నిలుస్తుందని తెలిపారు. రైతులు ఆర్థికంగా నష్టపోకూడదనే ఉదేశ్యంతో ప్రభుత్వమే మద్దతు ఇచ్చి దాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, ధాన్యం కొనుగోలు తో సీజన్ కు ప్రభుత్వానికి 5వేల కోట్ల నష్టం వస్తుందని అయినప్పటికీ రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని అన్నారు.రైతులు పంట అమ్మిన 3,4రోజులలోనే డబ్బులు రైతుల ఖాతాలలో జమ అవుతాయాని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా దాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలని సద్వినియోగం చేసుకొని మద్దతు ధరకు దాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు కేటాయించడం ద్వారా రెండు రకాల లాభాలు ఉన్నాయని మహిళా బాధ్యతగా పని చేస్తారని అలాగే ఉపాధి తో పాటు ఆదాయం వచ్చి మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడుతాయాని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, పిసిసి ఎస్సి సెల్ వైస్ చైర్మన్, మాజీ జెడ్పిటిసి చింతమళ్ల రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, కొణతం రాజేష్ రెడ్డి, పోతురాజు ఇందుశ్రీ, యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నెల్లుట్ల లింగస్వామి, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొండికత్తి వెంకటేశ్వర్లు బండారి వెంకన్న, మద్దెబోయిన శ్రీనివాస్, వాజిద్ మియా, పడిదల రవి, 8వ వార్డు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగ లింగా రెడ్డి, వాళ్లపట్ల నాగయ్య, జూలకంటి నాగేందర్ రెడ్డి, వెన్న మధుసూదన్ రెడ్డి, వాళ్లపట్ల ఉపేందర్, బండారి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.



