మునిపంపులలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో బడిబాట

మునిపంపులలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో బడిబాట

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, మునిపంపుల గ్రామంలో సోమవారం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, అఖిల పక్షాల ఆద్వర్యంలో ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా "మన ఊరు వెలగాలంటే, ఊళ్ళో బడిని వెలిగించాలి", "మన ఊరి బడిలోనే మన పిల్లలను చేర్పించాలి", మన బడిని మనమే కాపాడుకోవాలని "ఊళ్ళోని ప్రభుత్వ బడిని కాపాడుకుంటేనే - మన ఊరు బాగుపడుతుంది"' అని  మునిపంపుల సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దొడ్డి స్వామి అన్నారు. ఈ సందర్బంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద "మన ఊరు- మన బడి - మన బాధ్యత" అనే కరపత్రం ను ఆవిష్కరించి ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని  ప్రారంభించారు. తదుపరి గ్రామంలోని ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళే విద్యార్థుల ఇళ్ళకు పాఠశాలల ఉపాధ్యాయులు, అఖిల పక్షాల నాయకులతో కలిసి వెళ్ళి చైతన్యం చేసేలా మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో లభిస్తున్న సౌకర్యాల గురించి, ఉపాధ్యాయుల గురించి, ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునే ఆవశ్యకతను గుర్తు చేస్తూ, ఊర్లోని పిల్లలందరూ ఊరిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా అందరూ సహకరించాలని, ఊరు బడిని కాపాడుకునేలా ప్రయత్నం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ళ క్రాంతి, వార్డు మెంబర్లు యదాసు లక్ష్మణ్, మేకల జలందర్, కట్టా అరుణ్‌కుమార్, గ్రామ అఖిల పక్ష నాయకులు మన్నె పద్మారెడ్డి, కట్టా యాదయ్య, గాదె పారిజాత, తాల్లపల్లి జితేందర్, ఏలూరి రవి, తొలిపునూరి చంద్రశేఖర్, ఏ.ఏ.పిసి చైర్మన్ బత్తిని వెంకటమ్మ, రచ్చా రమేష్, గంటేపాక శివ,  ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ వి.దర్మేందర్, పాఠశాల ఉపాధ్యాయులు తిరుమల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, వసంత, మనోహర్, రేవతి, మంజుల, సరోజ, కంచి రవికుమార్, నాగలక్ష్మి, శ్రీశైలం, సునిత, రాకేశ్, గణేశ్, అంగన్ వాడీ టీచర్ బద్రున్నీసా, గ్రామ ప్రజలు, యువతీ యువకులు పాల్గొన్నారు.

Tags: