జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా
- ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
విశ్వంభర, ఉప్పల్: జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. జర్నలిస్టులంతా ఐక్యంగా ఉంటేనే హక్కులను సాధించుకోవచ్చునని సూచించారు. ఆదివారం ఉప్పల్ ప్రెస్ క్లబ్( ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా) నూతన సంవత్సర -2026 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం భగాయత్‌లోని శ్రీరస్తు కన్వెన్షన్‌లో జరిగింది. ఉప్పల్ ప్రెస్ క్లబ్(పి,ఈ) అధ్యక్షులు వడ్డేపల్లి కిషోర్, క్లబ్ ప్రధాన సలహాదారులు కంచుకట్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని అన్నారు. ఉప్పల్ ప్రాంత జర్నలిస్టులకు గతంలో ఇచ్చిన ప్లాట్ల విషయాన్ని కూడా అసెంబ్లీలో లేవనెత్తానున్నట్లు చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించేలా ప్రయత్నం చేయనున్నట్లు హామీ ఇచ్చారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించేలా కూడా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఉప్పల్ మున్సిపల్ మాజీ చైర్మన్ మేకల శివారెడ్డి, దుబ్బ నరసింహారెడ్డి, వివిధ పార్టీల నాయకులు తాడూరి శ్రీనివాస్, గంధం నాగేశ్వరరావు, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఆకారపు అరుణ్ పటేల్, నెర్ధం భాస్కర్‌గౌడ్, కోల రవికుమార్‌గౌడ్, ఎండి. రఫిక్, కంది శ్రవణ్ కుమార్, జలీల్‌పాషా, గుడి మధుసూదన్‌రెడ్డి, మేకల మధుసూదన్‌రెడ్డి, పిట్టల నరేష్, తెలంగాణ సంపత్, నాగరాజు, చల్ల వీరారెడ్డి, మార్నేని ఫణీంద్ర, గోనె శ్రీకాంత్ ముదిరాజ్, పూజల ప్రభాకర్, కొంపల్లి రవీందర్, ఈరెల్లి రవీందర్‌రెడ్డి, పల్లె నర్సింగ్‌రావు,సకినాల ప్రసాద్, మేకల దయాసాగర్‌రెడ్డి, తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మెరుగు చంద్రమోహన్, సలహాదారులు బెలిదే అశోక్ గుప్తా, డాక్టర్ శ్రీవాణి చౌదరి,సంయుక్త కార్యదర్శి వెంకట్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కీర్తి శ్రీనివాస్, ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శులు ఆనంద నరసింహారెడ్డి, పంబిళ్ల కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఓంకార్ సంతోష్, పయ్యావుల సంతోష్, లీగల్ అడ్వైజర్ హైకోర్టు న్యాయవాది కోండ్రోన్ పల్లి గిరిబాబు, క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.



