గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం
- సర్పంచ్ నవీన్
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ లోని 11వ వార్డులో మిద్దింటి ప్రభాకర్ ఇంటి వద్ద, 13వ వార్డులో తైదల లక్ష్మి ఇంటి వద్ద, వల్లెపు అనంతయ్య ఇంటి వద్ద 8 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో నూతన మోటార్ పంప్ సెట్, తాగునీటి సరఫరా పైప్ లైన్ వేయడం జరిగింది, ఈ సందర్భంగా సర్పంచ్ నవీన్ మాట్లాడుతూ, వేసవి కాలమును దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజలకు త్రాగునీటి కొరత ఏర్పడకుండా, గ్రామ ప్రజలు ఎవరు కూడా త్రాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొకుండా ఉండడానికి గ్రామంలో నూతన పంప్ సెట్ త్రాగునీటి సరఫరా పైప్ లైన్ వేయడం జరిగిందని, ప్రజలకు నిరంతర త్రాగు నీటి సరఫరా చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమములో ఉప సర్పంచ్ జొరల రమేశ్ , వార్డు నెంబర్స్ తింగిరికారి బేబీ, పోల్కం సునీత, ఆవులకాడి కిష్టామ్మ, స్వర్ణగంటి సంజీవ, మహమ్మద్ ఆజం, కడమోని స్వాతి, వత్తుల శాలిని, కాకి పరమేష్, దిద్దెల శ్రీశైలం, ఆకుల వీరిబాబు, సున్నం స్వప్నా, జటావత్ రుకేష్, రెవెళ్ళ చంద్రమౌళి, మాజీ సర్పంచ్ స్వర్ణగంటి ఆనందం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జావిద్ పిఎసిఎస్ డైరెక్టర్ కాడమోని ప్రభాకర్, మండల్ కో ఆప్షన్ నెంబర్ సయ్యద్ ఆదిల్ అలీ, పంచాయతి కార్యదర్శి సుజాత, బి ఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటికల మహేందర్ ముదిరాజ్, కట్నం పర్వతాలు, దుడ్డు కృష్ణ యాదవ్,టీ మక్కాజి,కావలి చంద్రయ్య, హనుమంతు, కటికెల పరమేష్, సున్నం కృష్ణ, ఏపూరి యాదయ్య,కటికల శ్రీనివాస్,ఒగ్గు స్వామి, కాకి నాగేష్,మిద్దింటి ప్రభాకర్, దానంద్ గౌడ్, ఆవులకాడి శ్రీశైలం, మిద్దింటి సిద్దు, గాజుల రాజు,మాడుగు రాజు, మహేష్ బాబు, మీదింటి శ్రీకాంత్, రవి చారి, టి రవి, కాలనీ మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



