పి.ఎన్.ఆర్ కాలనీలో ఘనంగా 'హిందూ సమ్మేళనం'
విశ్వంభర, అమీన్‌పూర్: మున్సిపల్ పరిధిలోని పి.ఎన్.ఆర్ కాలనీ పంచతత్వ పార్క్ క్రీడా ప్రాంగణంలో 'హిందూ సమ్మేళనం' కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో ఐక్యతను పెంపొందించడానికి, మన భారతీయ సంప్రదాయాలను, ధర్మాన్ని భావి తరాలకు అందించడానికి ఇలాంటి ఆధ్యాత్మిక సమ్మేళనాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మెలిగి, మన సంస్కృతి పరిరక్షణకు నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృష్ణ, కొల్లూరు చంద్రకళ గోపాల్, మాజీ కోఆప్షన్ సభ్యుడు తల్లారి రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మేళనానికి పి.ఎన్.ఆర్ కాలనీ వాసులు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



