పిల్లలూ.. అమ్మానాన్నలకు హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పండి
- ఎస్ ఐ కరుణాకర్
విశ్వంభర, ఇనుగుర్తి: చిన్నారులూ మీ అమ్మానాన్నలకు బైక్ పై వెళ్లేప్పుడు హెల్మెట్స్ పెట్టుకోవాలని చెప్పండి. మీ బుజ్జి బుజ్జి మాటలతో పేరెంట్స్ ను ప్రేరేపించండి అంటూ ఎస్సై గంగారపు కరుణాకర్ మండల కేంద్రం ఇనుగుర్తి లోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్ బాలబాలికలకు ఉద్బోధించారు. కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య యాదవ్ ఆధ్వర్యంలో పాఠశాలలో రోడ్ సేఫ్టీ పై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమానికి ఎస్సై హాజరయ్యారు. బాలబాలికలకు రోడ్ సేఫ్టీ పై లేఖలు రాయాలని కరస్పాండెంట్ కట్టయ్య,టీచర్స్ సూచించారు.ఎస్సై కరుణాకర్ అరైవ్ అలైవ్ పై బాల బాలికలకు అవగాహన కల్పిస్తూ బైక్ లు కార్లపై వేగంగా వెళ్లొద్దని, కార్లపై వెళ్లేప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని, రెడ్లైట్ వెలిగిన చోట ఆగాలని, మద్యం సేవించి డ్రైవ్ చేయొద్దని చెప్పాలని సూచించారు.మీరు సురక్షితంగా ఉంటేనే మా భవిత బాగుంటుందని చెప్పాలన్నారు. రోడ్ సేఫ్టీ పై ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో టీచర్స్ శిరీష, అప్సర,నవ్య,షాహిన్,రజిని,సులోచన, తల్లిదండ్రులు పాల్గొన్నారు.



