నిరుపేద ఆర్యవైశ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ
విశ్వంభర, సూర్యాపేట: అక్షయ తృతీయ పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సోమవారం శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య నిరుపేదలకు సుమారు 5 వేల రూపాయలు విలువ గల నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా శ్రీ వాసవి సేవా సమితి స్థాపించి నిరుపేద ఆర్యవైశ్యులకు ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 27 నుండి వేసవి సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు సూర్యాపేట ఉన్నత యోగ శిక్షణ కేంద్రం గురూజీ చాడపాపిరెడ్డి ఆధ్వర్యంలో 15 రోజులపాటు యోగా శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజ సేవే లక్ష్యంగా శ్రీ వాసవి సేవాసమితి పనిచేస్తుందని, భాగస్వామ్యం కావాలని అనుకునే ఆర్యవైశ్యులు శ్రీ వాసవి సేవా సమితి లో సభ్యులుగా చేరి సేవలు అందించవచ్చు అని తెలిపారు. వనపర్తికి చెందిన పూరి సురేష్ శెట్టి ఏర్పాటు చేసిన శ్రీ వాసవి సేవా సమితి గత తొమ్మిది సంవత్సరాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవలు అందిస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సమితి ఉపాధ్యక్షులు మిరియాల సుధాకర్, కుంచ మర్రి రాజశేఖర్ సహాయ కార్యదర్శి బచ్చు శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు వందనపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.



