పోలీస్​ ప్రజావాణిలో నిర్భయంగా ఫిర్యాదు చేయండి : సీపీ

పోలీస్​ ప్రజావాణిలో నిర్భయంగా ఫిర్యాదు చేయండి : సీపీ

విశ్వంభర, నిజామాబాద్ : పోలీస్​ ప్రజావాణిలో నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని సీపీ సాయిచైతన్య  అన్నారు. సీపీ కార్యాలయంలో సోమవారం పోలీస్​ప్రజావాణిలో భాగంగా 34 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించిన సీపీ సాయి చైతన్య, వారి సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు చేశారు. ఈ సందర్భంగా సీపీ, సాయి చైతన్య, మాట్లాడుతూ.. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలన్నారు. చట్ట ప్రకారం సమస్యలు పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని చెప్పారు.

Tags: