గోవుల సంరక్షణ అందరి బాధ్యత

గోవుల సంరక్షణ అందరి బాధ్యత

విశ్వంభర, తొర్రూరు: గోవుల సంరక్షణ అందరి బాధ్యతగా మారాలని వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ కపుల్స్ తొర్రూరు అధ్యక్షులు బిజ్జాల వెంకటరమణ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని వేణుగోపాలస్వామి గోశాల కు సోమవారం వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ కపుల్స్ తొర్రూరు అధ్యక్షులు బిజ్జాల వెంకటరమణ ఆధ్వర్యంలో  లక్ష రూపాయలు  విరాళంగా అందించారు. గోశాల అవసరాల నిమిత్తం ట్రాక్టర్ కొనుగోలుకై సదరు మొత్తాన్నివినియోగించనున్నట్లు తెలిపారు. సోమవారం డివిజన్ కేంద్రంలోని గోశాలలో రూ.1 లక్ష విరాళాన్ని వెంకటరమణ గోశాల అధ్యక్షులు దారం కుమారస్వామి వర్కింగ్ ప్రెసిడెంట్ కర్రా అశోక్ రెడ్డి  అందజేశారు.  గోశాల నిర్వాహకులు దాత వెంకటరమణకు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ... గోవుల సంరక్షణకు పాటుపడుతున్న స్థానిక గోశాలకు తోడ్పాటు అందించాలనే సంకల్పంతో ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ప్రకృతిలోని చెట్టూ చేమా, రాయీ రప్ప, పక్షులు, జంతువులు, మనకు అన్నీ పూజనీయాలే కానీ అగ్రస్థానం మాత్రం గోవుదేనన్నారు. సర్వ దేవతా స్వరూపమే గోవు అని,  33 కోట్ల దేవతలకు నిలయం గోవు శరీరం అన్నది మన నమ్మకమన్నారు.ప్రతి ఒక్కరూ గోవులను పూజించి గోమాత ఆశీస్సులు పొందాలని కోరారు.ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని అనుసరించాలని, గోమాతను పూజించాలని కోరారు. గో సంరక్షణ అందరి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐపీసీ ప్రొద్దుటూరు గౌరీశంకర్ , వీడీజీ రామ ఉపేందర్, జెడ్ సీ 3  శ్రవణ్ కుమార్, వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ కపుల్స్ ప్రధాన కార్యదర్శి నాళ్ళ కృష్ణమూర్తి, కోశాధికారి కొండ్లె చంద్రయ్య, గోశాల ప్రధాన కార్యదర్శి నాల కృష్ణమూర్తి, కోశాధికారి ధార నాగ శివప్రసాద్, భాస్కర్ రెడ్డి, కే నాగేంద్ర చారి, పి. వెంకటేశ్వర్లు, పి. రుద్రదేవ్, డి. ప్రభావతి, టీ. కరుణ శ్రీ, ఎన్. అనసూయ లు పాల్గొన్నారు.

Tags: